Breaking News

చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?

Published on Thu, 03/07/2024 - 12:03

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు డెవాన్‌ కాన్వే రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో గాయపడ్డ కాన్వే.. తన చేతి వేలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ కివీ స్టార్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాష్‌రీచ్‌ లీగ్‌కు డెవాన్‌ దూరమయ్యాడు.

ఈ క్రమంలో కాన్వే స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే ఫ్రాంచైజీ పడింది. అతడి స్ధానాన్ని దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో భర్తీ చేయాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

                        

కానీ ఇప్పుడు వాన్‌డెర్‌ డస్సెన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్‌కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లహోర్‌ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ప్రోటీస్‌ స్టార్‌ దుమ్ములేపుతున్నాడు.

ఇప్పటివరకు ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్‌.. 364 పరుగులతో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్‌ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌పై సీఎస్‌కే కన్నేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్‌ గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)