Breaking News

డీగో జోటా కుటుంబానికి చెల్సీ క్లబ్‌ సాయం

Published on Fri, 08/15/2025 - 04:11

లండన్‌: ఇంగ్లండ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ చెల్సీ పెద్ద మనసు చాటుకుంది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోర్చుగల్‌ యువ మిడ్‌ఫీల్డర్, లివర్‌పూల్‌ క్లబ్‌ ఫార్వర్డ్‌ డీగో జోటా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగిన క్లబ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో చెల్సీ జట్టు 3–0తో యూఈఎఫ్‌ఏ చాంపియన్‌ పారిస్‌ సెయింట్‌ జర్మయిన్‌ (పీఎస్‌జీ)పై ఘనవిజయం సాధించింది. దీంతో క్లబ్‌కు ప్రైజ్‌మనీతో పాటు బోనస్‌ కలిపి మొత్తం 11.4 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) లభించాయి. 

ఈ మొత్తాన్ని ఆటగాళ్లంతా సమాన భాగాలు చేశారు. ఇందులో నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4.38 కోట్లు) మృతి చెందిన లివర్‌పూల్‌ క్లబ్‌ ప్లేయర్‌ డీగో జోటా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు చెల్సీ సిద్ధమైంది. ఈ మేరకు చెల్సీ క్లబ్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. పోర్చుగల్‌కు చెందిన జోటా పావోస్‌ డి ఫెరీరాతో ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. 

తర్వాత 2016లో అట్లిటికో మాడ్రిడ్‌తో జట్టు కట్టాక కెరీర్‌లో ఊపందుకున్నాడు. ప్రీమియర్‌ లీగ్‌లో వాల్వొర్‌హాంప్టన్‌ వాండరర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2020 నుంచి లివర్‌పూల్‌ జట్టుకు ఆడుతున్నాడు. 2024–2025 ఇంగ్లండ్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌లో లివర్‌పూల్‌ చాంపియన్‌గా నిలిచింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)