Breaking News

ఒకే రోజు రెండు వరల్డ్‌ రికార్డులు బద్దలు

Published on Mon, 07/07/2025 - 15:25

యుజీన్‌ (అమెరికా): మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్‌ లీగ్‌లో భాగంగా అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రిఫోంటెయిన్‌ క్లాసిక్‌ మీట్‌లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. 

మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఫెయిత్‌ కిపియేగాన్‌ 1500 మీటర్ల విభాగంలో... పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్‌ చెబెట్‌ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్‌ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.

ఈ క్రమంలో గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్‌ తిరగరాసింది. కిపియేగాన్‌ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్‌ చెబెట్‌ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.

5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందిన చెబెట్‌... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్‌ క్లాసిక్‌ మీట్‌లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్‌ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో చెబెట్‌ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్‌’ సాధించిన మూడో అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)