Breaking News

Champions Trophy 2025: పాక్‌పై కోహ్లి సెంచరీ.. ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు

Published on Mon, 02/24/2025 - 10:14

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy) పాక్‌పై విరాట్‌ (Virat Kohli) సెంచరీని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. నిన్న దుబాయ్‌లో దాయాదితో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభిమానులు భారత విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

మ్యాచ్‌ జరిగిన దుబాయ్‌లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్‌ చూడటానికి వచ్చిన సెలబ్రిటీలు సైతం సాధారణ వ్యక్తుల్లా భారత విజయాన్ని ఆస్వాధించారు. కోహ్లి క్రేజ్‌ ఎల్లలు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్‌ సిటిజన్లు కోహ్లి తమ సొంత జట్టుపై సెంచరీ చేసినా సెలబ్రేట్‌ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు జరిగాయి.

కొందరు క్రికెట్‌ అభిమానులు భారత్‌, పాక్‌ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి విరాట్‌ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌పై భారత విజయాన్ని అతి సున్నితమైన కశ్మీర్‌ ప్రాంతంలోనూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. భారత అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చారు. 'భారత్‌ మాతాకి జై' అన్న నినాదాలతో యావత్‌ భారత దేశం మార్మోగిపోయింది. కోహ్లి నామస్మరణతో క్రికెట్‌ ప్రపంచం దద్దరిల్లింది.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సూపర్‌ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్‌ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిశాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్‌ అయ్యర్‌ (56), శుభ్‌మన్‌ గిల్‌ (46), కుల్దీప్‌ యాదవ్‌ (9-0-40-3), హార్దిక్‌ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌ (46), ఖుష్దిల్‌ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, హార్దిక్‌ 2, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైంది. వరుస  పరాజయాలతో పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)