Breaking News

Champions Trophy 2025: ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం​ చేసుకున్న న్యూజిలాండ్‌ బౌలర్‌

Published on Sun, 03/02/2025 - 21:09

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఇవాళ (మార్చి 2) తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ మెగా టోర్నీలో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (8-0-42-5) నమోదు చేసిన కివీస్‌ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు
5/42 - మాట్ హెన్రీ, 2025
4/25 - నవీద్-ఉల్-హసన్, 2004
4/36 - షోయబ్ అక్తర్, 2004
4/62 - డగ్లస్ హోండో, 2002

ఈ మ్యాచ్‌లో హెన్రీ కీలకమైన శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా వికెట్లతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ వికెట్లు తీశాడు. స్కోర్‌ 15 పరుగుల వద్ద ఉండగానే గిల్‌ను ఔట్‌ చేసిన హెన్రీ భారత్‌ను తొలి దెబ్బ తీశాడు. అనంతరం గత మ్యాచ్‌ సెంచరీ హీరో విరాట్‌ను ఔట్‌ చేసి టీమిండియా కష్టాలను మరింత అధికం చేశాడు. 

ఇన్నింగ్స్‌ చివర్లో ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ను ఔట్‌ చేసి భారత్‌ భారీ స్కోర్‌ చేయకుండా కళ్లెం వేశాడు. ఒక్కో పరుగు కీలకమైన తరుణంలో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తున్న రవీంద్ర జడేజాను ఔట్‌ చేశాడు. చివరిగా షమీని ఔట్‌ చేసి కెరీర్‌లో మూడో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మ్యాట్‌ హెన్రీ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో  శ్రేయస్‌ అయ్యర్‌ (79), అక్షర్‌ పటేల్‌ (42), హార్దిక్‌ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్‌-3 బ్యాటర్లు విఫలమయ్యారు. 

రోహిత్‌ శర్మ 15, శుభ్‌మన్‌ గిల్‌ 2, విరాట్‌ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్‌ రాహుల్‌ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌, విలియమ్‌ రూర్కీ, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు.

అనంతరం 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉంది. ఆ జట్టు 37 ఓవర్ల అనంతరం సగం​ వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే 78 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కేన్‌ విలియమ్సన్‌ (76) క్రీజ్‌లో పాతుకుపోయాడు. 

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 22, రచిన్‌ రవీంద్ర 6, డారిల్‌ మిచెల్‌ 17, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 12 పరుగులు చేసి ఔటయ్యారు. విలియమ్సన్‌కు జతగా బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లో ఉన్నాడు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)