Breaking News

ODI World Cup 2025: శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Published on Wed, 09/10/2025 - 19:07

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ చమరి అటపత్తు వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు. 

27 ఏళ్ల హర్షిత గత కొన్నాళ్లగా శ్రీలంక జట్టులో కీలక​ సభ్యురాలిగా కొనసాగుతోంది. హర్షిత 41 వన్డేల్లో 1,075 పరుగులు చేసింది. గతేడాది జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్‌పై హర్షిత అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. దీంతో 2024 ఆగస్టు నెలకు గాను సిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆమె ఎంపికైంది. 

అదేవిధంగా యువ పేస్ సంచలనం దేవ్మి విహంగాకు ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో దేవ్మి విహంగా 11 వికె‍ట్లతో సత్తాచాటింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్‌లో గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.

మహిళల వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు
చమరి అతపత్తు (కెప్టెన్‌), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవీ విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, ఉద, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోదని, మల్కీ మదర, అచ్చిని కులసూర్య

మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)