Breaking News

సెంట్రల్‌ జోన్‌ దీటైన జవాబు

Published on Sat, 09/06/2025 - 04:26

బెంగళూరు: క్రీజులోకి దిగిన టాపార్డర్‌ బ్యాటర్లంతా రాణించడంతో దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో  సెంట్రల్‌ జోన్‌ దీటైన జవాబిచ్చింది. వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దానిశ్‌ మాలేవర్‌ (136 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్‌), శుభమ్‌ శర్మ (148 బంతుల్లో 60 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. 

వెస్ట్‌ బౌలర్లలో ఆర్జన్‌ నగ్వాస్‌వాలా, ధర్మేంద్రసింగ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 363/6తో ఆట కొనసాగించిన వెస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 438 పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (98 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించాడు. సారాంశ్‌ జైన్, హర్‌‡్ష దూబే చెరో 3 వికెట్లు తీయగా, ఖలీల్‌ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. 

నడిపించిన శార్దుల్‌ 
వెస్ట్‌జోన్‌ను నాయకుడు శార్దుల్‌ ఠాకూర్‌ నడిపించాడు. క్రితం రోజే అర్ధసెంచరీ బాదిన ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ తనుశ్‌ కొటియాన్‌ (166 బంతుల్లో 76; 6 ఫోర్లు) మరో 11 పరుగులే జత చేసినప్పటికీ ఇతని అండతో శార్దుల్‌ ధాటిగా ఆడాడు. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ఠాకూర్, బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో జట్టు స్కోరు 400 పరుగులు దాటింది. 

కాసేపటికి లేని పరుగుకు ప్రయత్నించి శార్దుల్‌ రనౌట్‌ కావడంతో ఆఖరి 4 వికెట్లు 27 పరుగుల వ్యవధిలోనే కూలాయి. తనుశ్‌తో పాటు ఆఖరి బ్యాటర్‌ ఆర్జన్‌ (3)లను హర్ష్ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ధర్మేంద్రసింగ్‌ జడేజా (1) ఎల్బీ కాగా, తుషార్‌ దేశ్‌పాండే (18 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు వెస్ట్‌ 75 పరుగులు జతచేసింది. 

టాప్‌–4 సూపర్‌ 
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన సెంట్రల్‌ జోన్‌కు టాప్‌–4 బ్యాటర్లు గొప్ప ఆరంభాన్నిచ్చారు. దానిశ్‌ మాలేవర్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆయుశ్‌ పాండే (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) వన్డే తరహా ఆటతీరుతో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 67 పరుగుల వద్ద పాండే అవుట్‌ కాగా... తర్వాత వచి్చన శుభమ్‌ శర్మ, దానిశ్‌లు చక్కని సమన్వయంతో జట్టు స్కోరును పెంచారు. 

ఇద్దరు అటు వికెట్‌ను కాపాడుకుంటూనే ఎంచక్కా పరుగులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వెస్ట్‌ బౌలర్లు వికెట్ల తీసేందుకు నానాకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్‌ మాలేవర్‌ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దుర్బేధ్యంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు ధర్మేంద్రసింగ్‌ విడగొట్టడంతో 160 పరుగుల వద్ద సెంట్రల్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. 93 పరుగుల రెండో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది. 

క్రీజులో పాతుకుపోయిన శుభమ్‌ శర్మకు కెప్టెన్  రజత్‌ పాటీదార్‌ జతయ్యాడు. వీరిద్దరు కూడా అవలీలగా పరుగులు సాధిస్తూ జట్టు స్కోరును 200 పైచిలుకు పెంచారు. శుభమ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని అజేయగా నిలువగా... పాటీదార్‌ (59 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) 3 పరుగుల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం 209 పరుగులు వెనుకబడి ఉన్న సెంట్రల్‌ జోన్‌ చేతిలో ఇంకా 8 వికెట్లున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)