కెప్టెన్‌ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్‌

Published on Sat, 06/24/2023 - 09:12

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌(CWC 2023)లో స్కాట్లాండ్‌ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  స్కాట్లాండ్‌ కెప్టెన్‌ రిచీ బెరింగ్టన్‌  (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్‌ లీస్క్‌ 41, మార్క్‌ వాట్‌ 31 బంతుల్లో 44 నాటౌట్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్‌ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ ముహ్మద్‌ వసీమ్‌ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్‌ బౌలర్లలో షరీఫ్‌ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్‌ సోల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్‌ సూపర్‌ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్‌ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.

చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్‌' బ్యాక్‌గ్రౌండ్‌.. రోమాలు నిక్కబొడిచేలా..

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)