Breaking News

బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్‌

Published on Fri, 06/06/2025 - 15:32

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్‌ 4న) జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా స్పందించాడు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.

శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా నిన్న బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో గిల్‌తో పాటు పాల్గొన్న గంభీర్‌ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు. 

ముందుగా నేను రోడ్‌ షోలకు వ్యతిరేకం. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. విజయోత్సవాల కంటే జనం ప్రాణాలు ముఖ్యం. రోడ్‌ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.

గెలుపు సంబరాలు చేసుకోవద్దని నేను అనను. కానీ దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఇతరుల ప్రాణాలు రిస్క్‌ అయ్యే విధంగా సంబరాలు ఉండకూడదు. ఇంత ప్రాణ నష్టం కలిగించిన రోడ్‌ షోలను భవిష్యత్తులో నిర్వహించకూడదు.

కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్‌ జర్నీలో తొలిసారి టైటిల్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని భావించింది. 

ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్‌ టాప్‌ బస్‌లో పరేడ్‌ నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. 

ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్‌లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)