Breaking News

ఇక సెలవు.. గెలిచిన ప్రైజ్‌మనీ రూ. 187 కోట్లు

Published on Tue, 01/13/2026 - 09:13

మాంట్రియల్‌: కెనడా టెన్నిస్‌ ప్లేయర్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల రావ్‌నిచ్‌ 2016లో కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌ను అందుకున్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో చివరిసారి టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడిన రావ్‌నిచ్‌ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన రావ్‌నిచ్‌ తన కెరీర్‌లో మొత్తం 8 ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌ను సాధించాడు. 

‘సమయం వచ్చేసింది. నేను టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నాను. ఏ క్రీడాకారుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడు. నా జీవితంలో చాలా ఏళ్లు టెన్నిస్‌ అంతర్భాంగా ఉంది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది’ అని రావ్‌నిచ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

ఫెడరర్‌ను ఓడించి
2016లో రావ్‌నిచ్‌ కెరీర్‌ అత్యుత్తమ దశలో నిలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్‌ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ను ఓడించి రావ్‌నిచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

అయితే ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయి ఈ కెనడా స్టార్‌ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అదే ఏడాది  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్‌ చేరిన అతను ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.  

కెరీర్‌లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ - 2,07,64,512డాలర్లు (రూ. 187 కోట్లు).
రావ్‌నిచ్‌ సాధించిన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌-3.
ప్రొఫెషనల్‌ కెరీర్‌లో రావ్‌నిచ్‌ గెలిచిన మ్యాచ్‌లు- 383
కెరీర్‌లో సాధించిన ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌- 8

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)