Breaking News

Olympics 2024: నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా.. తెలుగు బిడ్డకు బిగ్‌ ఛాలెంజ్‌

Published on Fri, 07/26/2024 - 19:06

ఒలింపిక్స్‌లో ప‌త‌క‌మే ల‌క్ష్యంగా ప్యారిస్‌లో అడుగుపెట్టిన‌ వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు క‌ఠిన‌మైన డ్రా ల‌భించింది. ఒలింపిక్స్ 2024 బాక్సింగ్ డ్రాను నిర్వ‌హ‌కులు శుక్ర‌వారం విడుద‌ల చేశారు. 50 కేజీల‌ బాక్సింగ్‌ ఈవెంట్ తొలి రౌండ్‌లో నిఖ‌త్ జ‌రీన్ జ‌ర్మనీ సంచ‌ల‌నం క‌రీనా క్లొయెట్జ‌ర్‌తో త‌ల‌ప‌డ‌నుంది. క్లొయెట్జ‌ర్‌పై విజ‌యం సాధిస్తే రెండో రౌండ్‌లో జ‌రీన్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత, టాప్ ర్యాంక‌ర్ వూ యూ(చైనా) నుంచి గ‌ట్టి స‌వాల్ ఎదురుకానుంది. 

నిఖత్ జరీన్‌తో పాటు మరో భార‌త మ‌హిళా బాక్స‌ర్, టోక్యో ఒలింపిక్ కాంస్య ప‌తక విజేత లోవ్లినా బోర్గోహైన్‌కు కూడా కష్ట‌మైన డ్రా ల‌భించింది. 75 కేజీల విభాగంలో తొలి రౌండ్‌లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌తో లోవ్లినా త‌ల‌ప‌డ‌నుంది. ఒకవేళ ఆమె ఫ‌స్ట్ రౌండ్‌లో విజ‌యం సాధిస్తే.. రెండు సార్లు ఒలింపిక్స్ మెడ‌లిస్ట్, చైనా స్టార్ బాక్స‌ర్ లి కియాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. 

అదేవిధంగా మహిళల 54 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా తొలి రౌండ్‌లో టోక్యోలో సిల్వర్ గెలిచిన ఫిలిప్పీన్స్‌ బాక్సర్ నెస్తీ పెటెసిను ఢీకొట్ట‌నుంది. మరోవైపు పురుషుల విభాగంలో పోటీ ప‌డుతున్న‌ బాక్సర్లు నిషాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగ‌ల్‌ (52 కిలోలు)కు మాత్రం బై ద‌క్కింది. ఇక శ‌నివారం నుంచి(జూలై 27)  బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)