Breaking News

టీమిండియాతో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

Published on Mon, 10/14/2024 - 09:45

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్నిక్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధ్రువీకరించింది.

కాగా గ్రీన్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్‌ గాయపడ్డాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యలు సూచించారు. దీంతో గ్రీన్  శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు. 

సర్జరీ అనంతరం అతడు కనీసం 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, శ్రీలంక పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీలకు గ్రీన్ దూరం ఉన్నాడు. అతడు తిరిగి ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశముంది.

"గ్రీన్ వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో చిన్న ప‌గులు ఉన్న‌ట్లు తేలింది.  మా వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత కామెరాన్ శస్త్రచికిత్స చేసుకోవడానికి సిద్దమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాము" అని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. 

కాగాప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు నిజంగా ఇది గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక నవంబరు 22- జనవరి 7 వరకు భారత్‌-ఆసీస్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనుంది.
చదవండి: Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)