Breaking News

IPL 2023: హాట్‌ ఫేవరెట్‌ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు?

Published on Fri, 12/23/2022 - 16:24

ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరున్‌ గ్రీన్‌ ఎవరు ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. శుక్రవారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే కామెరున్‌ గ్రీన్‌ది రెండో అత్యధిక ధర. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్‌ గ్రీన్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇదే వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ను రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకోవడంతో అతను తొలిస్థానంలో ఉన్నాడు.

ఇక ఈసారి వేలంలో హాట్‌ ఫేవరెట్‌ గా ఉన్న కామెరున్‌ గ్రీన్‌ అంత ధరకు పలుకుతాడని ఎవరు ఊహించి ఉండరు. రూ. 10 నుంచి 15 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరి కామెరున్‌ గ్రీన్‌కు దీనిని అందుకునే అర్హత ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే గ్రీన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. 23 ఏళ్ల వయసు మాత్రమే కలిగిన గ్రీన్‌ ఆస్ట్రేలియా తరపున 2020లో అడుగుపెట్టాడు.

కామెరున్‌ గ్రీన్‌ అటు కొత్త బంతితో, డెత్‌ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థుడు. అంతేకాదు బ్యాటింగ్‌లో లోయర్‌ ఆర్డర్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. మంచి ఫీల్డర్‌ కూడా. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ తరపున ఆడుతున్న కామెరున్‌ గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా తరపున కామెరున్‌ గ్రీన్‌ 20 టెస్టులు, 13 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: సామ్‌ కరన్‌ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా

బ్రూక్‌ పంట పండింది.. ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మారేనా!

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)