Breaking News

గిల్‌ది ఔటే.. నేను క్లియర్‌గానే క్యాచ్‌ పట్టుకున్నా: గ్రీన్‌

Published on Sun, 06/11/2023 - 13:29

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన విధానం తీవ్రదుమారం రేపుతోంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‍ది నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ మంచి ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో గిల్‌ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్‍లో కామెరూన్ గ్రీన్‍కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే గ్రీన్‌ పట్టిన క్యాచ్‌ స్పష్టంగా లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్‌ ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వివాదంపై నాలుగో రోజు ఆట అనంతరం కామెరూన్ గ్రీన్‍ స్పందించాడు. తను క్లియర్‌ క్యాచ్‌ పట్టానని గ్రీన్‌ చెప్పుకొచ్చాడు. "గిల్‌ క్యాచ్‌ను నేను సృష్టంగా పట్టుకున్నానని భావించాను. ఆ సమయంలో నేను అది క్లియర్‌ క్యాచ్‌ అనుకుని బంతి పైకి విసిరి సెలబ్రేట్‌ చేసుకున్నాను. నా వైపు నుంచి ఎటువంటి సందేహాలు లేవు.

కానీ తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వదిలేశాను.  నా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ సమయం ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌కే కేటాయించేవాడిని. అదే విధంగా టెస్టుల్లో మొదటి లేదా రెండో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో నేను కొన్ని మంచి క్యాచ్‌లను పట్టుకున్నాను.

కానీ రెండో రోజు ఆటలో కొన్ని సులభమైన క్యాచ్‌లను విడిచిపెట్టాను. అది నన్ను చాలా నిరాశపరిచింది. అయితే తర్వాత అంతకమించిన క్యాచ్‌లను పట్టడం చాలా సంతోషంగా ఉంది" అని పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్ లో గ్రీన్‌ పేర్కొన్నాడు.
చదవండి: WTC FINAL: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)