Breaking News

జోరు వర్షంలోనూ ఆగని పరుగు.. గెలిచినోళ్ల కంటే ఎక్కువ పేరు

Published on Thu, 05/11/2023 - 17:09

ఆటపై ఇష్టం.. గెలవాలన్న పట్టుదల ఉంటేనే ఛాంపియన్స్‌గా నిలుస్తారని అంటారు. అంతిమంగా ఆటలో ఒకరే ఛాంపియన్‌ కావొచ్చు..ఒకవేళ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనా చివరి వరకు పోటీలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఆ కొందరి నుంచి పుట్టిందే కంబోడియాకు చెందిన అథ్లెట్‌ బౌ సామ్నాంగ్.

ఓటమి ఖరారైనా జోరు వర్షంలోనూ సామ్నాంగ్‌ తన పరుగును ఆపలేదు. 5000 మీటర్ల రేసును వర్షంలోనే పూర్తి చేసి ఆటపై తనకున్న మక్కువను చూపించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం దిశగా సాగి గెలవాలన్న తన పట్టుదలను పరిచయం చేసింది. తోటి అథ్లెట్లు పక్కకు తప్పుకున్నా తాను మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. అందుకే రేసులో గెలిచిన అథ్లెట్‌ కంటే బౌ సామ్నాంగ్‌కు ఎక్కువ పేరొచ్చింది. 

22 నిమిషాల 52 సెకన్లలో రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్‌ ఎమోషనల్‌ అయింది. దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. జోరు వర్షంలోనూ తన పరుగుకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ‍్క్షతలు తెలిపింది. రేసులో బౌ సామ్నాంగ్‌ ఓడినా అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బౌ సామ్నాంగ్‌ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ గేమ్స్‌లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన 5000 మీటర్ల రేసులో వియత్నాంకు చెందిన గుయన్‌ తి వోనా విజేతగా నిలిచింది. ఇక రేసు అనంతరం కంబోడియా ప్రధాని హున్‌ సన్‌.. బౌ సామ్నాంగ్‌ అంకితభావానికి ముచ్చటపడి  10వేల డాలర్లను రివార్డుగా ఇవ్వడం విశేషం.

బౌ సామ్నాంగ్‌ను ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోసీ) ఆకాశానికెత్తింది. రేసు ఓడిపోయి ఉండొచ్చు.. తన అంకితభావంతో విజేతను మించిపోయింది అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ప్రస్తుతం బౌ సామ్నాంగ్‌ రేసుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)