Breaking News

హ్యాండ్ ఇచ్చిన జోస్ బ‌ట్ల‌ర్‌.. గుజ‌రాత్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?

Published on Thu, 05/15/2025 - 15:18

ఐపీఎల్‌-2025 పునఃప్రారంభానికి స‌ర్వం సిద్దమైంది.  మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవనున్నాయి. అయితే ఐపీఎల్ పునఃప్రారం వేళ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్‌, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్.. జాతీయ విధుల కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు.

భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్‌..తిరిగి ఐపీఎల్‌లో పాల్గోనేందుకు రావడం లేదు. ఈ విష‌యాన్ని బ‌ట్ల‌ర్‌ ఇప్ప‌టికే గుజ‌రాత్ ఫ్రాంచైజీకి తెలియ‌జేశాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో బట్లర్ సభ్యునిగా ఉన్నాడు. 

మే 29 నుంచి ఇంగ్లండ్ జ‌ట్టు విండీస్ పర్య‌ట‌న ప్రారంభం కానుంది. కాగా తొలుత బ‌ట్ల‌ర్ ఐపీఎల్‌లో ఆడేందుకు తిరిగి భార‌త్‌కు వ‌స్తాడ‌ని, ప్లే ఆఫ్స్‌కు మాత్ర‌మే దూరం కానున్న‌డాని వార్త‌లు వినిపించాయి. కానీ పూర్తిగా ఇప్పుడు మిగిలిన సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. జోస్ బ‌ట్ల‌ర్ ప్రస్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు.

ఈ ఏడాది సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బ‌ట్ల‌ర్‌..71.43 స‌గ‌టుతో 500 ప‌రుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు బ‌ట్ల‌ర్ దూరం కావ‌డం గుజ‌రాత్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌గానే చెప్పాలి. గుజ‌రాత్ ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉంది. టైటాన్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు గిల్ సేన త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.

గుజ‌రాత్ జ‌ట్టులోకి స్టార్ ప్లేయ‌ర్‌..
ఇక గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం బ‌ట్ల‌ర్ స్ధానాన్ని శ్రీలంక వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండీస్‌తో భ‌ర్తీ చేసిన‌ట్లు  తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ శ్రీలంక క్రికెట‌ర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2025లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ తాత్కాలికంగా వాయిదా ప‌డ‌డంతో మెండిస్‌తో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌త‌కట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో మే 18న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)