జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం.. విండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజ‌యం

Published on Mon, 11/11/2024 - 11:18

బ్రిడ్జిటౌన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జ‌ట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు సాధించింది.

విండీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్‌ రావ్‌మ‌న్ పావెల్‌(43) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. షెఫార్డ్ 22 ప‌రుగుల‌తో రాణించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లివింగ్ స్టోన్‌, మౌస్లీ, మ‌హ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చ‌ర్‌, ర‌షీద్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం..
అనంత‌రం 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఊదిప‌డేసింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ జోస్‌ బ‌ట్ల‌ర్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 83 ప‌రుగులు చేశాడు.

అత‌డితో పాటు విల్ జాక్స్‌(38) రాణించాడు. విండీస్ బౌల‌ర్ల‌లో షెఫ‌ర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 నవంబ‌ర్ 14న సెయింట్ లూసియా వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.
చదవండి: IND vs SA: సంజూ శాంసన్‌ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)