Breaking News

శతకాలతో చెలరేగిన బట్లర్‌, మలాన్‌.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం

Published on Thu, 02/02/2023 - 10:30

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్‌ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌, ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది.

బట్లర్‌(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్‌ మలాన్‌(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్‌ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 80 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్‌ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌  ఆరు వికెట్లతో టాప్‌ లేపగా.. ఆదిల్‌ రషీద్‌ మూడు వికెట్లు తీశాడు.

ఇక ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును జాస్‌ బట్లర్‌ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్‌ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్‌ రీఎంట్రీ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్‌ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్‌ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం అని చెప్పొచ్చు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు