Breaking News

రెండు టోపీలు... రెండు ట్రోఫీలు

Published on Mon, 02/24/2025 - 03:53

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇదివరకే ప్రకటించిన అవార్డుల్ని ఆదివారం భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అందుకున్నాడు. 2024 క్యాలెండర్‌ ఇయర్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రదర్శన కనబరిచిన ఈ భారత సీనియర్‌ పేసర్‌ పురుషుల క్రికెట్‌లో నాలుగు అవార్డులకు ఎంపికయ్యాడు. ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’... ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వ్యక్తిగత అవార్డులు కాగా... 2024 ప్రదర్శన ఆధారంగా అన్ని దేశాల నుంచి ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ఎంపిక చేసింది. 

ఐసీసీ ప్రకటించిన టి20, టెస్టు జట్లలోనూ బుమ్రా ఉన్నాడు. దీంతో ‘టి20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’... ‘టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాలల్లో భాగంగా ఐసీసీ ప్రత్యేకమైన రెండు టోపీలను అందజేసింది. వ్యక్తిగత అవార్డులుగా రెండు ట్రోఫీలను బహూకరించింది. ప్రస్తుతం వెన్నుగాయంతో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఈ ‘పేస్‌ ఎక్స్‌ప్రెస్‌’ అవార్డు స్వీకరించేందుకే దుబాయ్‌కి వచ్చాడు. 

ఉదయం మ్యాచ్‌కు ముందు తుది కసరత్తులో ఉన్న తమ జట్టు సహచరులతో ఆత్మీయంగా భేటీ అయ్యాక దాయాదుల మ్యాచ్‌ ఆరంభానికి ముందు అవార్డులు అందుకున్నాడు. ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. గతేడాది టెస్టుల్లో కేవలం 13 మ్యాచ్‌లే ఆడిన 31 ఏళ్ల బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 70 పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఘనతకెక్కాడు. 

అతనికంటే ముందువరుసలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్, లెజెండ్‌ స్పిన్నర్లు అనిల్‌ కుంబ్లే, అశి్వన్‌ ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన బుమ్రా... ఆ్రస్టేలియాలో జరిగిన ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో 32 వికెట్లు తీశాడు. అంటే కేవలం రెండే రెండు జట్లతో జరిగిన ముఖాముఖి సిరీస్‌ల్లోనే 51 వికెట్లు పడగొట్టడం విశేషం. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)