Breaking News

అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్‌ కోసం!

Published on Wed, 08/14/2024 - 17:44

దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులిప్‌ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్‌ ట్రోఫీలో.. రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, కేఎల్‌ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, సూర్యకుమార్‌ యాదవ్, రజత్‌ పటిదార్‌ తదితరులు దులీప్‌ ట్రోఫీలో పాల్గొననున్నారు.

ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్‌-’ఎ’ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌, టీమ్‌-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్‌, టీమ్‌-సి నాయకుడిగా రుతురాజ్‌ గైక్వాడ్‌, టీమ్‌-డి కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.

అన్నదమ్ముల మధ్య పోటీ?
వారు మరెవరో కాదు ఖాన్‌ సోదరులు.. సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌. టీమ్‌-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్సీలో సర్ఫరాజ్‌తో పాటు ముషీర్‌ కూడా దులిప్‌ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్‌ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్‌తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 200 పరుగులు సాధించాడు.

తమ్ముడు ఆల్‌రౌండర్‌
నాడు కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఈసారి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్‌.. ఫస్ట్‌క్లాస్‌ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.

అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇప్పటిదాకా 48 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్‌ ఆడిన ఆరు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్‌రౌండర్‌ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్‌ స్పెషలిస్టు బ్యాటర్‌ కాగా.. ముషీర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కావడం గమనార్హం.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు