Breaking News

స్క్వాష్‌లో మహిళల జట్టుకు కాంస్యం

Published on Sat, 09/30/2023 - 02:34

ఆసియా క్రీడల స్క్వాష్‌ క్రీడాంశంలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్‌ సింగ్, దీపిక పల్లికల్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ హాంకాంగ్‌ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో తన్వీ ఖన్నా 6–11, 7–11, 3–11తో చాన్‌ సిన్‌ యుక్‌ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 7–11, 11–7, 9–11, 11–6, 11–8తో హో జె లోక్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది.

నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అనాహత్‌ సింగ్‌ 8–11, 7–11, 10–12తో లీ కా యి చేతిలో ఓడిపోయింది. 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు 2014, 2018 క్రీడల్లో రజతం సాధించింది.  మరోవైపు భారత పురుషుల జట్టు 2–0తో డిఫెండిగ్‌ చాంపియన్‌ మలేసియాను ఓడించి పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో అభయ్‌ సింగ్‌ 11–3, 12–10, 9–11, 11–6తో అదీన్‌ ఇద్రాకీపై... రెండో మ్యాచ్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ 11–8, 11–6, 10–12, 11–3తో ఎన్జీ ఎయిన్‌పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)