శకం ముగిసింది.. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి స్టార్ రెజ్ల‌ర్ గుడ్ బై

Published on Wed, 08/05/2026 - 14:17

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ సూప‌ర్‌స్టార్ బ్రాక్ లెస్న‌ర్ ప్రొఫెష‌న‌ల్ రెజ్లింగ్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఆగ‌స్టు 1న మిన్నెసోటా వేదిక‌గా జ‌రిగిన 'స‌మ్మ‌ర్ స్లామ్‌' ఈవెంట్‌లో నైజిరీయా స్టార్ రెజ్ల‌ర్ ఒబా ఫెమీ చేతిలో ఓట‌మి అనంత‌రం బ్రాక్ లెస్న‌ర్ ఈ ప్ర‌క‌ట‌న చేశాడు. 49 ఏళ్ల బ్రాక్ లెస్న‌ర్ ప‌దిసార్లు డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ చాంపియ‌న్‌గా నిలిచాడు. 


Photo Credit: WWE Twitter

ఈ ఏడాది 'రెజ‌ల్‌మేనియా 42' ఈవెంట్‌లో మెగా క్లాష్‌లోనే ఓబా ఫెమీ చేతిలో ఓట‌మి పాలైన బ్రాక్ లెస్న‌ర్ అప్పుడే వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు తెలిపాడు. కానీ త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న బ్రాక్ లెస్న‌ర్ 'స‌మ్మ‌ర్ స్లామ్‌'లో ఒబా ఫెమీతో ఫైన‌ల్ ఫైట్‌కు సిద్ధ‌మ‌య్యాడు. 'హెల్ ఇన్ ఏ సెల్‌' కేజ్‌లో జ‌రిగిన ఫైట్‌లో బ్రాక్ లెస్న‌ర్ మూడుసార్లు సూప్లెక్సెస్‌తో పాటు ఎఫ్‌-5 ఇచ్చిన‌ప్పటికీ ఒబా ఫెమీ ఏం కాన‌ట్లు లేచి నిల్చున్నాడు. 

ఆ త‌ర్వాత ఫెమీ త‌న ఫెవ‌రెట్ షాట్ 'ఫాల్ ఫ్ర‌మ్ గ్రేస్‌'తో లెస్న‌ర్‌పై విరుచుకుప‌డ‌డంతో అత‌డికి ఓట‌మి త‌ప్పలేదు. కాసేప‌టి త‌ర్వాత పైకి లేచిన బ్రాక్ లెస్న‌ర్‌.. ఒబా ఫెమీ చేతిని పైకి లేపి 'ఫ్యూచ‌ర్ ఆఫ్‌ డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ' అని పేర్కొన్నాడు. ఇక నాది గ‌తం అని పేర్కొన్న లెస్న‌ర్‌.. 'నేను ఈరోజు రిటైర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా' అని ఎమోష‌న‌ల్ అయ్యాడు. దీంతో 24 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్‌కు బ్రాక్ లెస్న‌ర్ వీడ్కోలు పలికిన‌ట్ల‌యింది.


Photo Credit: WWE Twitter

49 ఏళ్ల బ్రాక్ లెస్న‌ర్ 10 సార్లు డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంతో పాటు రెండుసార్లు 'రాయ‌ల్ రంబుల్' విన్న‌ర్‌గా (2003, 2022), 2002లో 'కింగ్ ఆఫ్ ది రింగ్' గా నిలిచాడు. 2019లో 'మ‌నీ ఇన్ ది బ్యాంక్‌' సొంతం చేసుకున్నాడు. అయితే 2004లో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈని వీడిన బ్రాక్ లెస్న‌ర్ ఆ త‌ర్వాత కొంత‌కాలం నేష‌న‌ల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్‌)లో ఆడాడు. ఆ త‌ర్వాత 2007లో మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) లో అడుగుపెట్టిన బ్రాక్ లెస్న‌ర్ 2008లో రాండీ కౌచ‌ర్‌ను ఓడించి యూఎఫ్‌సీ హెవీవెయిట్ చాంపియ‌న్‌గా నిలిచాడు. 

2012లో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి రీఎంట్రీ ఇచ్చిన లెస్న‌ర్ ఎక్స్‌ట్రీమ్ రూల్‌లో జాన్ సీనా చేతిలో ఓడిపోయాడు. ఆ త‌ర్వాత సీనా, ట్రిబుల్ హెచ్‌, సీఎం పంక్‌, రోమ‌న్ రీయిన్స్‌, హండ‌ర్‌టేక‌ర్‌, రాండీ ఆర్ట‌న్, గోల్డ్‌బ‌ర్గ్‌, సెత్ రాలిన్స్‌, సామి జోల‌ను ఓడించి త‌న రీఎంట్రీని గొప్ప‌గా మ‌లుచుకున్న లెస్న‌ర్ మ‌ల్టీ టైమ్ చాంపియ‌న్‌గా నిలిచాడు. 

 

2014లో రెజ‌ల్‌మేనియా 30లో హండ‌ర్‌టేక‌ర్‌ను ఓడించి అతడి అన్‌డిఫీట్ స్ట్రీక్‌ను(21-1) బ్రేక్ చేసిన లెస్న‌ర్ డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఐకాన్‌గా మారిపోయాడు. తాజాగా ఒబా ఫెమీ రూపంలో ఫ్యూచ‌ర్ డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ  స్టార్‌ క‌నిపించ‌డంతో త‌న వీడ్కోలుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బ్రాక్ లెస్న‌ర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు.

Read: 22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)