కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

Published on Sun, 06/21/2026 - 17:47

లండన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల మెరుగైన స్కోర్ సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (100) అద్భుత సెంచరీతో బ్లాక్‌క్యాప్స్‌ను ఆదుకున్నాడు. 

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (5/80) ధాటికి 291 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 100 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో ఎమిలియో గే (53), మాథ్యూ ఫిషర్ (50) మాత్రమే రాణించారు.  

నికోల్స్‌ సెంచరీ
కాగా పర్యాటక కివీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. సీనియర్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌(121) సెంచరీతో సత్తాచాటగా.. రచిన్ రవీంద్ర (76), మిచెల్ (68) ఆర్ధ శతకాలతో చెలరేగారు. ఫలితంగా న్యూజిలాండ్ 362 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 463 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ఉంచింది.

ఈ భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో 209 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటైంది. మాట్ హెన్రీ 6 వికెట్ల పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో జేమిసన్ మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (77), హ్యారీ బ్రూక్ (58) మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి కివీస్ విజయంలో కీలక​ పాత్ర పోషించిన మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్ మ్యాచ్  జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సెంచ‌రీ హీరోకు నో ఛాన్స్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)