Breaking News

బుమ్రా ఒ‍క్కడే ఏమి చేయగలడు.. ముంబై బౌలింగ్‌పై లారా విమర్శలు

Published on Mon, 04/15/2024 - 19:40

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా ముంబై విఫలమైంది. దీంతో తమ సొంత గ్రౌండ్‌లో ఓటమిపాలై మరోసారి ముంబై జట్టు విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై బౌలింగ్‌ విభాగం అంత పటిష్టంగా లేదని లారా అభిప్రాయపడ్డాడు.

"ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ పరంగా చాలా బలంగా కన్పిస్తోంది. సన్‌రైజర్స్‌పై 230 పరుగుల టార్గెట్‌ ఛేజింగ్‌లో కూడా వారు దగ్గరగా వచ్చారు. ఆ తర్వాత ఆర్సీబీపై  196 లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలో ఛేదించారు. నిన్నటి సీఎస్‌కే మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు పర్వాలేదన్పించారు. కానీ ముంబై బౌలింగ్‌ విభాగం మాత్రం పేలవంగా ఉంది. బౌలింగ్‌లో యూనిట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా ఒంటరియ్యాడు.

అతడికి మిగితా బౌలర్ల నుంచి సహకారం లభించడం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఏడు ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ నాలుగు ఓవర్లే బౌలింగ్ చేశారు. దూబే క్రీజులో ఉన్నాడని స్పిన్నర్లను హార్దిక్‌ నమ్మలేదు. బౌలింగ్ విషయంలో ముంబై ఇండియన్స్‌ మెరుగ్వాలి. సీఎస్‌కే బౌలింగ్‌ యూనిట్‌ను చూసి ప్రత్యర్ది జట్లు చాలా విషయాలు నేర్చుకోవాలి. సీఎస్‌కేలో ప్రతీ బౌలర్‌కు తమ రోల్‌పై ఒక క్లారిటీ ఉందని" స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ లైవ్‌లో లారా పేర్కొన్నాడు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)