Breaking News

27 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్‌ లారా! వీడియో

Published on Sun, 01/28/2024 - 14:57

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విండీస్‌ గెలుపొందింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై విండీస్‌కు ఇది 27 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం కావడం విశేషం.

ఈ విజయంలో విండీస్‌ యువ పేసర్‌ షామర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. తన బొటన వేలు విరిగినప్పటికి జోసెఫ్ అద్భత ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్‌ లారా..
కాగా చారిత్రాత్మక విజయం అనంతరం ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా భావోద్వేగానికి లోనయ్యాడు. లారా ఒక్కసారిగా  ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర కామెంటేటర్‌ గిల్‌ క్రిస్ట్‌.. లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కోర్లు
విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 310/10
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌:   289/9(డిక్లెర్‌)
విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 193/10
ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 207/7
ఫలితం: 8 పరుగుల తేడాతో విండీస్‌ విజయం

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)