Breaking News

జింబాబ్వే ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు..

Published on Thu, 08/07/2025 - 21:19

జింబాబ్వే సీనియ‌ర్ ఆట‌గాడు బ్రెండ‌న్ టేల‌ర్ దాదాపు నాలుగేళ్ల‌ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పునరాగ‌మ‌నం చేశాడు. బులవాయో వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టేల‌ర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో టేల‌ర్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

21వ శతాబ్దంలో లాంగెస్ట్ టెస్టు క్రికెట్ ఆడిన ప్లేయ‌ర్‌గా టేల‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పాడు. 2004లో జింబాబ్వే త‌ర‌పున అరంగేట్రం చేసిన బ్రెండ‌న్‌.. ఇప్ప‌టివ‌ర‌కు 21 ఏళ్ల 93 రోజుల పాటు టెస్టుల్లో కొన‌సాగాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గ‌జ పేస‌ర్ జేమ్స్ ఆండ‌ర్స‌న్ పేరిట ఉండేది. 

ఆండ‌ర్స‌న్ త‌న కెరీర్‌లో 21 ఏళ్ల 51 రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడాడు. తాజా మ్యాచ్‌తో ఆండ‌ర్స‌న్ ఆల్‌టైమ్ రికార్డును టేల‌ర్ బ్రేక్ చేశాడు. కాగా 39 ఏళ్ల‌ టేల‌ర్‌పై 2022లో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఓ వ్యాపారవేత్త నుండి బ‌హుమ‌తులు తీసుకోవ‌డంతో అత‌డిపై ఐసీసీ చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది. అయితే ఇప్పుడు ఐసీసీ అత‌డిపై బ్యాన్ ఎత్తేయ‌డంతో రీఎంట్రీ ఇచ్చాడు.

కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో  జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీస్ పేస‌ర్ మాట్ హెన్రీ 6 వికెట్లు ప‌డ‌గొట్టి జింబాబ్వే ప‌త‌నాన్ని శాసించాడు. హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లు సాధించాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్‌(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)