Breaking News

16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Published on Mon, 04/14/2025 - 01:31

స్టాక్‌హోమ్‌ (స్వీడన్‌): పురుషుల స్విమ్మింగ్‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్‌ ఓపెన్‌ స్టాక్‌హోమ్‌ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్‌ మార్టిన్‌ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్‌ మార్టిన్‌ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 

ఈ క్రమంలో 2009 నుంచి పాల్‌ బీడెర్మన్‌ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్‌ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో ‘సూపర్‌ సూట్స్‌’ ధరించి బీడెర్మన్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్‌ సమాఖ్య ‘సూపర్‌ సూట్స్‌’ను నిషేధించింది.   

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)