Breaking News

భారత్‌లో పర్యటించనున్న బ్రెజిల్ ఫుట్‌బాల్‌ జట్టు..?

Published on Sat, 07/25/2026 - 11:59

భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఓ అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (CBF) ఇప్పటికే సెప్టెంబర్ 25న టౌన్స్‌విల్లే, సెప్టెంబర్ 29న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఖరారు చేసింది. వీటికి అదనంగా అక్టోబర్ తొలి వారంలో భారత్‌లో మరో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ESPN Brasil వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.

ఈ మ్యాచ్‌కు కోల్‌కతా వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని సమాచారం.

ప్రపంచకప్ సమయంలో కోల్‌కతాలో వేలాది మంది అభిమానులు బ్రెజిల్ జెర్సీలు ధరించి సందడి చేయడం.. నెయ్‌మార్, వినీసియస్ జూనియర్ చిత్రాలతో నగరం కళకళలాడడం CBF దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.

అన్ని చర్చలు విజయవంతంగా పూర్తైతే, తుది ఒప్పందంపై సంతకాలు జరిగి బ్రెజిల్ జట్టు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)