Breaking News

సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ వెనక్కు

Published on Thu, 04/18/2024 - 12:30

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్‌కు (అమెరికా ఆఫ్‌ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్‌కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్‌ బేస్డ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అయిన అమెరికా ఆఫ్‌ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 

80, 90 దశకాల్లో స్టార్‌ స్ట్రయికర్‌గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టులో (బ్రెజిల్‌) కీలక సభ్యుడిగా ఉన్నాడు. 

ప్రస్తుతం రొమారియో సెనేటర్‌గా ఉంటూనే తన క్లబ్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు.  అమెరికా ఆఫ్‌ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. 

కాగా, బ్రెజిల్‌లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అమెరికా ఆఫ్‌ రియో డి జనైరో క్లబ్‌ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్‌ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్‌లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)