Breaking News

వేలానికి బ్రాడ్‌మన్‌ ‘బ్యాగీ గ్రీన్‌’

Published on Wed, 12/31/2025 - 02:39

సిడ్నీ: క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌కు చెందిన మరో ‘బ్యాగీ గ్రీన్‌’ క్యాప్‌ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. 1947–48 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ఈ క్యాప్‌ ధరించాడు. 

ఈ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 178.75 సగటుతో బ్రాడ్‌మన్‌ 715 పరుగులు (ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి) సాధించాడు. బ్రాడ్‌మన్‌ తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన ఏకైక సిరీస్‌ ఇదే కాగా...స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

ఈతరంలో ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒక సారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్‌ ఇస్తే కెరీర్‌ చివరి వరకు దానినే వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి రోజుల్లో ప్రతీ సిరీస్‌కు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు కొత్త బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను అందించేవారు. అందు వల్లే బ్రాడ్‌మన్‌కు చెందిన పలు క్యాప్‌లు వేర్వేరు మ్యూజియంలలో ఉండగా, ఇతర క్యాప్‌లు, జ్ఞాపికలను పలువురు ప్రైవేట్‌ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. 

1947–48 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్‌ సొహొని ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్‌ ముగిసిన అనంతరం వాసుదేవ్‌కు బ్రాడ్‌మన్‌ తన క్యాప్‌ను కానుకగా అందించాడు. గత 78 ఏళ్లుగా ఈ క్యాప్‌ వాసుదేవ్‌ కుటుంబం వద్దే ఉంది. 

ఇప్పుడు దీనిని ప్రముఖ ఆక్షనర్‌ లీ హేమ్స్‌ వేలం వేస్తున్నాడు. జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ధరించిన మరో క్యాప్‌ను వేలం వేస్తే దానికి రూ.2.63 కోట్లు లభించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)