Breaking News

'అతడొక అద్భుతం.. వారిద్దరూ చెలరేగితే విండీస్‌కు చుక్కలే'

Published on Tue, 07/11/2023 - 16:26

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న తిలక్‌ వర్మపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ప్రశంసల వర్షం​ కురిపించాడు. తిలక్‌ వర్మ తన బ్యాటింగ్‌ స్కిల్స్‌తో తనను ఎంతగానే అకట్టుకున్నాడని హాగ్ కొనియాడాడు. కాగా దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీకి విండీస్‌ టూర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

గత రెండు సీజన్లగా ముంబై ఇండియన్స్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్‌ వర్మ.. తన అద్బుత ప్రదర్శరనతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్‌ 2023లో 11 మ్యాచ్‌లు ఆడిన వర్మ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. ఇక వర్మతో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌కు కూడా భారత టీ20 జట్టులో చోటు దక్కింది. 

ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. తిలక్‌ వర్మ ఒక అద్బుతం. అతడు తన ప్రదర్శనతో ఎంతగానే అకట్టుకున్నాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ జట్టుతో కాస్త సమయం గడిపాను. అతడు ప్రత్యర్ది బౌలర్లను అర్ధం చేసుకునే విధానం నాకు చాలా నచ్చింది. వర్మకు ఏ స్ధానంలైనా బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది.

ఎటువంటి క్లిష్ట పరిస్ధితులనైనా తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. అదే విధంగా యువ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌,  జైస్వాల్ ఇద్దరూ అధిక స్ట్రైక్ రేట్లు కలిగి ఉన్నారు. వారు ఫాస్ట్ బౌలర్‌లను అద్భుతంగా ఎదుర్కొంటారు. కాబట్టి పవర్‌ ప్లేలో వీరిద్దరూ హిట్టింగ్‌ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవు అని  అతడు చెప్పుకొచ్చాడు.
చదవండి: ODI WC 2023: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్‌! లేదంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)