కైల్‌ మేయర్స్‌ ఆల్‌రౌండ్‌ షో.. మెరుపు అర్దశతకం సహా..!

Published on Mon, 02/26/2024 - 16:18

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫార్చూన్‌ బారిషల్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ (వెస్టిండీస్‌) ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో రాణించిన మేయర్స్‌ ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరిశాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛాలెంజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌, సైఫుద్దీన్‌, మెక్‌కాయ్‌ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్‌ పతనాన్ని శాశించారు. తైజుల్‌ ఇస్లాం, జేమ్స్‌ ఫుల్లర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఛాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌లో జోష్‌ బ్రౌన్‌ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్‌ షువగట (24), ట్రామ్‌ బ్రూస్‌ (17), సైకత్‌ అలీ (11), రొమారియో షెపర్డ్‌ (11), నిహాదుజ్జమాన్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు. 

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌.. కైల్‌ మేయర్స్‌, తమీమ్‌ ఇక్బాల్‌ (52 నాటౌట్‌) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. 

బారిషల్‌ ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్‌ (0) విఫలం కాగా.. డేవిడ్‌ మిల్లర్‌ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్‌ రహాం (6 నాటౌట్‌) విన్నింగ్‌ రన్స్‌ కొట్టాడు. ఛాలెంజర్స్‌ బౌలర్లలో షువగట, బిలాల్‌ ఖాన్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రంగ్పూర్‌ రైడర్స్‌, కొమిల్లా విక్టోరియన్స్‌ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్‌-2లో ఫార్చూన్‌ బారిషల్‌తో తలపడుతుంది.


 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)