Breaking News

బెన్నీ హోవెల్‌ వీర బాదుడు.. లిటన్‌ దాస్‌ పోరాటం వృధా

Published on Mon, 02/19/2024 - 19:32

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో సిల్హెట్‌ స్ట్రయికర్స్‌ ఆటగాడు బెన్నీ హోవెల్‌ (ఇంగ్లండ్‌) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్ట్రయికర్స్‌.. హోవెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

స్ట్రయికర్స్‌ ఇన్నింగ్స్‌లో హోవెల్‌ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్‌ లెవిస్‌ 33, జాకిర్‌ హసన్‌ 18, షాంటో 12, యాసిర్‌ అలీ 2, కెప్టెన్‌ మిథున్‌ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ హొసేన్‌ 2, ముస్ఫిక్‌ హసన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్‌ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్‌ దాస్‌ (85) విక్టోరియన్స్‌ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్‌ గెలవలేకపోయింది.

లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్‌ కీలక ఆటగాళ్లు జాన్సన్‌ చార్లెస్‌ (17), మొయిన్‌ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్‌ బౌలర్లలో తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ 3, సమిత్‌ పటేల్‌, షఫీకుల్‌ ఇస్లాం, బెన్నీ హోవెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)