బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్‌, తమీమ్‌

Published on Tue, 01/31/2023 - 21:06

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్‌ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్‌ ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (55 బంతుల్లో 91 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖుల్నా టైగర్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసిం​ది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ హోప్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్‌ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్‌ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్‌ హొసేన్‌ తలో వికెట్‌ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (1) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. ఆఖర్లో ఆజమ్‌ ఖాన్‌ (4 బంతుల్లో 12 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) కూడా మెరుపులు మెరిపించాడు.

అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్‌ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేస్తుంది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (4) రిటైర్డ్‌ హర్ట్‌గా, కెప్టెన్‌ ఇమ్రుల్‌ ఖయేస్‌ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్‌ రిజ్వాన్‌ (32 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్‌ చార్లెస్‌ (29 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్‌ స్కోర్‌ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)