Breaking News

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం.. పాక్‌ బ్యాటర్‌ ఊచకోత

Published on Thu, 01/19/2023 - 20:57

Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్‌పూర్‌ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్‌లో ఫార్చూన్‌ బారిషల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్‌ ఆటగాడు ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.

అతని జతగా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (43 బంతుల్లో 89 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడటంతో ఫార్చూన్‌ బారిషల్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇది బీపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్‌ టోటల్‌గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్‌-షకీబ్‌ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు.

బీపీఎల్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్‌-షకీబ్‌ జోడీ ఇన్నింగ్స్‌ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్‌లో 22, 19వ ఓవర్‌లో 24, 20వ ఓవర్‌లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్‌-షకీబ్‌ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది.

కాగా, బీపీఎల్‌ ప్రస్తుత సీజన్‌లో షకీబ్‌ సారధ్యంలోని ఫార్చూన్‌ బారిషల్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్‌ ప్లేస్‌లో సిల్హెట్‌ స్ట్రయికర్స్‌ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్‌ ఉంది.

కొమిల్లా విక్టోరియన్స్‌, రంగ్‌పూర్‌ రైడర్స్‌, చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌, ఖుల్నా టైగర్స్‌, ఢాకా డామినేటర్స్‌ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్‌లో పాకిస్తాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. 
 

Videos

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

Photos

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)