ధోనికి కోపం వచ్చింది.. అతడి వల్లే: అశ్విన్‌

Published on Sat, 07/13/2024 - 15:52

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌కు ‘మిస్టర్‌ కూల్‌’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్‌ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.

తొలిసారి ధోని కోప్పడటం చూశా
2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్‌ ది స్ట్రీట్స్‌- ఏ కుట్టీ క్రికెట్‌ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్‌ సంగతులను ప్రస్తావిస్తూ..

‘‘ఆరోజు నేను డ్రింక్స్‌ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని  హెల్మెట్‌ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.

అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్‌) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్‌ అడిగాడు.

శ్రీశాంత్‌కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్‌ రిటర్న్‌ చేశాడు.

శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!
అప్పుడు కామ్‌గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్‌ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్‌.. రంజీబ్‌ సర్‌(టీమ్‌ మేనేజర్‌) దగ్గరికి వెళ్లు.

శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్‌ బుక్‌ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.

ధోని అలా అనడం ఊహించని నాకు షాక్‌ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్‌ తన పుస్తకంలో రాశాడు.

ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్‌ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్‌ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్‌ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.

మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్‌ టికెట్‌ గురించి మేనేజర్‌తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్‌ వెల్లడించాడు.

ధోని కోపానికి కారణం ఇదే
కాగా రిజర్వ్‌ ఆటగాళ్లతో పాటు డగౌట్‌లో కూర్చోకుండా పేసర్‌ శ్రీశాంత్‌ డ్రెస్సింగ్‌రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్‌తో మెసేజ్‌ పంపగా.. శ్రీశాంత్‌ జెర్సీ వేసుకుని డగౌట్‌కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్‌ కూడా సర్వ్‌ చేశాడట. అదీ సంగతి!

చదవండి: బ్లడ్‌ క్యాన్సర్‌.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్‌ దేవ్‌ విజ్ఞప్తి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)