Breaking News

ధీరజ్‌కు రెండు పతకాలు

Published on Fri, 12/19/2025 - 03:18

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌టీపీసీ జాతీయ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రెండు పతకాలతో మెరిశాడు. రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్‌... టీమ్‌ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం ముగిసిన ఈ పోటీల్లోపురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ఫైనల్లో ధీరజ్‌ 6–0తో పార్థ్‌ సుశాంత్‌ సాలుంకే (మహారాష్ట్ర)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. 

టీమ్‌ విభాగంలో ధీరజ్, రాహుల్, సుఖ్‌చెయిన్‌ సింగ్‌లతో కూడిన సర్వీసెస్‌ జట్టు ఫైనల్లో అభ్యుదయ్, పార్థ్‌ సాలుంకే, సాహిల్‌లతో కూడిన మహారాష్ట్ర జట్టు చేతిలో ఓడిపోయింది. గౌరవ్, యశ్‌దీప్, పవన్‌లతో కూడిన రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) జట్టుకు కాంస్య పతకం దక్కింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు అర్జున్‌ ముండా ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ నిర్వహణ కోసం భారత్‌ బిడ్‌ దాఖలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు ముందుకొచ్చే క్రీడా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, జనరల్‌ సెక్రటరీ అరవింద్, ఆర్చరీ డెవలప్‌మెంట్‌ సభ్యుడు పుట్టా శంకరయ్య, హైదరాబాద్‌ ఆర్చరీ సంఘానికి చెందిన అశ్విన్‌ రావు, బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ గుస్తీ నోరియా, కమిటీ సభ్యుడు మర్రి ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)