Breaking News

షకీబ్‌ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చైర్మెన్‌

Published on Fri, 09/27/2024 - 09:45

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ అంత‌ర్జాతీయ టీ20ల‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ష‌కీబ్ త‌న భ‌ద్ర‌త గురుంచి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. "బంగ్లాలో నా చివ‌రి టెస్టు ఆడాల‌ని ఉంది. భార‌త్ నుంచి అక్క‌డ‌కు వెళ్లేంద‌కు నాకు ఎలాంటి స‌మ‌స్య ఎదురుకాక‌పోవ‌చ్చు. కానీ అక్క‌డ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. 

నా స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు అని ష‌కీబ్ పేర్కొన్నాడు. తాజాగా ఇదే విష‌యంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. ష‌కీబ్ భ‌ద్ర‌త‌కు బోర్డు ఎటువంటి హామీ ఇవ్వ‌లేద‌ని  ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు.

"ష‌కీబ్ భ‌ద్ర‌త ఆంశం మా చేతుల్లో లేదు. బోర్డు ఎవ‌రికీ వ్యక్తిగతంగా భద్రతను అందించదు. అత‌డు త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. అత‌డి భ‌ద్ర‌త విష‌యంపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి వ‌ర్గాలు స్పందిస్తాయి. బీసీబీ.. పోలీసు లేదా రాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి భద్రతా ఏజెన్సీ కాదు. మేము ఈ విష‌యం గురించి ప్ర‌భుత్వంలో ఎవరితోనూ చ‌ర్చించ‌లేదు. 

స్వదేశంలో తన చివరి టెస్టు అతడు ఆడవచ్చు. అందుకు ఎటువంటి సమస్య లేదు. షకీబ్ తన జీవితంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడితో తన రిటైర్మెంట్ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు.  రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము" అని ఫరూక్ పేర్కొన్నారు
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి