ఒకే సమయంలో విధ్వంసకర శతకాలు.. ఐపీఎల్‌లో అభిషేక్‌.. పీఎస్‌ఎల్‌లో రిజ్వాన్‌, విన్స్‌

Published on Sun, 04/13/2025 - 13:30

క్రికెట్‌ అభిమానులు శనివారం (ఏప్రిల్‌ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్‌ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్‌ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్‌ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్‌.

నిన్న సాయంత్రం సన్‌రైజర్స్‌, పంజాబ్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో మరో సూపర్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌.. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (63 బంతుల్లో 105 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో షాయ్‌ హెప్‌ 8, ఉస్మాన్‌ ఖాన్‌ 19, కమ్రాన్‌ ఘులామ్‌ 36, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ 44 పరుగులు (నాటౌట్‌) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్‌ అలీ, అబ్బాస్‌ అఫ్రిది, ఖుష్దిల్‌ షా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్‌ విన్స్‌ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్‌ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌ (12) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. టిమ్‌ సీఫర్ట్‌ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్‌ బౌలర్లలో అకీఫ్‌ జావిద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌, ఉసామా మిర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)