లాథమ్‌, రచిన్‌ భారీ శతకాలు.. పట్టు బిగించిన న్యూజిలాండ్‌

Published on Thu, 12/04/2025 - 11:40

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో కదంతొక్కడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్‌ 417/4గా ఉంది. విల్‌ యంగ్‌ (21), బ్రేస్‌వెల్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, షీల్డ్స్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. చంద్రపాల్‌ (52), హోప్‌ (56) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు. జేకబ్‌ డఫీ 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. హెన్రీ 3, ఫౌల్క్స్‌ 2 వికెట్లు తీశారు.

దీనికి ముందు న్యూజిలాండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (231) ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52), బ్రేస్‌వెల్‌ (47) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్‌ బౌలర్లు తలో చేయి వేసి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)