Breaking News

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్‌ ఓటమి

Published on Sun, 12/17/2023 - 12:34

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్‌ షాంటో టాస్‌ గెలచి తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ ఆహ్హనించాడు.

అయితే కివీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్‌ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ విల్‌ యంగ్‌(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ లాథమ్‌(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

బంగ్లా బౌలర్లలో షోర్‌ఫుల్‌ ఇస్లాం రెండు, మెహది హసన్‌ మిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్‌లే కావడం గమనార్హం. అనంతం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్‌ క్యాప్స్‌ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్‌సన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండిENG vs WI: ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే


Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు