Breaking News

"టూర్‌ డి ఫ్రాన్స్‌" టైటిల్‌ గెలిచిన బినియం గిర్మే.. తొలి ఆఫ్రికన్‌గా రికార్డు

Published on Thu, 07/04/2024 - 11:22

ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్‌ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్‌ డి ఫ్రాన్స్‌ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్‌ సైకిల్ రేసు)  స్టేజ్‌ టైటిల్‌ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్‌ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్‌ డి లీ కంటే ముందే రేస్‌ ఫినిష్‌ చేసి టైటిల్‌ గెలిచాడు.

24 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్‌. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్‌ టైటిల్‌ గెలిచాడు. మరోవైపు టూర్‌ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్‌ పొగాకర్‌ నుంచి పసుపు జెర్సీని (రేస్‌ లీడర్‌) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్‌ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్‌ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.

టూర్‌ డి ఫ్రాన్స్‌ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్‌ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్‌ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)