Breaking News

నెదర్లాండ్స్, స్లొవేనియాలతో భారత్‌ ‘ఢీ’

Published on Fri, 06/20/2025 - 02:08

బెంగళూరు: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ వరల్డ్‌ టీమ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది నవంబర్‌ 14 నుంచి 16 వరకు బెంగళూరులోని ఎస్‌ఎం కృష్ణ టెన్నిస్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఇవే తేదీల్లో ఇతర గ్రూప్‌ల ప్లే ఆఫ్స్‌ టోర్నీలను నిర్వహిస్తారు. ‘ప్లే ఆఫ్స్‌’కు మొత్తం 21 జట్లు అర్హత పొందాయి. 21 జట్లను ఏడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లకు చోటు కల్పించారు. 

గ్రూప్‌ విజేతగా నిలిచే ఏడు జట్లు వచ్చే ఏడాది బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. 2021 తర్వాత వరల్డ్‌ గ్రూప్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత పొందిన భారత జట్టుకు గ్రూప్‌ ‘జి’లో చోటు దక్కింది. గ్రూప్‌ ‘జి’లోనే నెదర్లాండ్స్, స్లొవేనియా జట్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాలంటే భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. 

పుణేలో ఇటీవల జరిగిన ఆసియా జోన్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో టాప్‌–2లో నిలవడం ద్వారా భారత్, న్యూజిలాండ్‌ జట్లు ‘ప్లే ఆఫ్స్‌’ టోర్నీకి అర్హత పొందాయి. హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అద్భుత ఆటతీరు కనబరిచి తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి భారత్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. రష్మికతోపాటు సహజ యామలపల్లి, అంకిత రైనా, వైదేహి, ప్రార్థన, మాయా రాజేశ్వరన్‌ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు.  

గట్టిపోటీ తప్పదు... 
వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు తొలిసారి అర్హత పొందాలంటే భారత్‌ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. భారత్‌ ప్రత్యర్థులుగా ఉన్న నెదర్లాండ్స్, స్లొవేనియాలతో పోలిస్తే టీమిండియా నుంచి ఒక్కరు కూడా టాప్‌–300 ర్యాంకింగ్స్‌లో లేకపోవడం గమనార్హం. మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి శ్రీవల్లి రష్మిక (322), సహజ (342), అంకిత రైనా (347), వైదేహి (368) మాత్రమే టాప్‌–400లో ఉన్నారు. డబుల్స్‌లో మాత్రం భారత్‌ నుంచి ఇద్దరు టాప్‌–200లో ఉన్నారు.

ప్రార్థన తొంబారే 145వ ర్యాంక్‌లో, అంకిత రైనా 190వ ర్యాంక్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌ జట్టులో సింగిల్స్‌ విభాగంలో టాప్‌–100లో ఇద్దరు సుజాన్‌ లామెన్స్‌ (70), అరంటా రుస్‌ (91)... డబుల్స్‌లో టాప్‌–100లో ఇద్దరు డెమీ షుర్స్‌ (18), ఇసాబెల్లి హవెర్లాగ్‌ (91) ఉన్నారు. స్లొవేనియా జట్టులో సింగిల్స్‌ విభాగంలో టాప్‌–250లో ఇద్దరు వెరోనికా ఎర్జావెక్‌ (172), తమారా జిదాన్‌సెక్‌ (206)... డబుల్స్‌లో టాప్‌–300లో ఇద్దరు కాజా జువాన్‌ (259), ఇవా ఫాల్క్‌నర్‌ (219) ఉన్నారు.  

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌ గ్రూప్‌ వివరాలు 
గ్రూప్‌ ‘ఎ’: కెనడా, డెన్మార్క్, మెక్సికో. 
గ్రూప్‌ ‘బి’: పోలాండ్, రుమేనియా, న్యూజిలాండ్‌. 
గ్రూప్‌ ‘సి’: స్లొవేకియా, స్విట్జర్లాండ్, అర్జెంటీనా. 
గ్రూప్‌ ‘డి’: చెక్‌ రిపబ్లిక్, కొలంబియా, క్రొయేషియా. 
గ్రూప్‌ ‘ఇ’: ఆస్ట్రేలియా, బ్రెజిల్, పోర్చుగల్‌. 
గ్రూప్‌ ‘ఎఫ్‌’: జర్మనీ, బెల్జియం, తుర్కియే. 
గ్రూప్‌ ‘జి’: నెదర్లాండ్స్, స్లొవేనియా, భారత్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)