Breaking News

12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. చరిత్రపుటల్లోకెక్కిన బీహార్‌ ఆటగాడు

Published on Fri, 01/05/2024 - 18:28

12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీ‌లోకి అరంగేట్రం చేయడం ద్వారా బీహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్‌లో బీహార్‌ తరఫున బరిలోకి దిగిన వైభవ్‌.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్‌ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్‌ పేరిట ఉంది. అలీముద్దీన్‌ 1942-43 రంజీ సీజన్‌లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు.

అలీముద్దీన్‌ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రికార్డు ఎస్‌కే బోస్‌, మొహమ్మద్‌ రంజాన్‌ పేరిట ఉంది. బోస్‌.. 1959-60 రంజీ సీజన్‌లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్‌.. 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి డెబ్యూ చేశాడు. ఈ ముగ్గురు వైభవ్‌ కంటే చిన్నవయసులోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 

వైభవ్‌.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్‌ కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో బీహార్‌ తరఫున ఓ మ్యాచ్‌ ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్‌కు లోకల్‌ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో ఇవాళ మొదలైన రంజీ మ్యాచ్‌లో వైభవ్‌ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బుపేన్‌ లాల్వాని (65), సువేద్‌ పార్కర్‌ (50), తనుశ్‌ కోటియన్‌ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్‌ బౌలర్లలో వీర్‌ ప్రతాప్‌ సింగ్‌ 4, సకీబుల్‌ గనీ, హిమాన్షు సింగ్‌ తలో 2 వికెట్లు, అషుతోష్‌ అమన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)