Breaking News

క్రికెట్‌లో కొత్త పంథా.. ఐపీఎల్‌ 2023 నుంచే మొదలు

Published on Tue, 03/07/2023 - 17:12

ఐపీఎల్‌ జట్లకు గుడ్‌న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి డీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించనున్నారు. ఔట్‌, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్‌, వైడ్‌ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్‌ మార్చారు. అయితే ఈ నిబంధనను ఇప్పటికే వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో ఉపయోగిస్తున్నారు.

శనివారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌ తొలి ఎడిషన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ వైడ్‌ బాల్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ కోరింది. ఈ ఫలితం హర్మన్‌కు అనుకూలంగా వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరులోనూ ఈ రూల్‌ను వాడారు. మేఘన్‌ షూట్‌ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు.

ఒక్కోసారి అంపైర్‌ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్‌ గమనమే మారిపోతుంది. కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది.  గతంలో ఇన్నింగ్స్‌ ఆఖరి బంతులు నోబాల్‌ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నోబాల్‌, వైడ్‌ బాల్‌ కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది.

''మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్‌ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్‌ బాల్‌, నోబాల్‌ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు'' అని డబ్ల్యూపీఎల్‌ నిబంధనల్లో పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్‌ 2023 సీజన్‌లోనూ ఈ రూల్‌ వర్తించనుంది.

చదవండి: పిచ్‌తో మైండ్‌గేమ్‌.. కలవరపడుతున్న 'కంగారూలు'

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)