Breaking News

అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్‌

Published on Sat, 04/19/2025 - 11:32

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాటిదార్‌ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.

ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌, యజువేంద్ర చహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఒక వికెట్‌ సాధించాడు.

ఇక పంజాబ్‌ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు కూల్చాడు.

అతిపెద్ద గుణపాఠం
ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar).. బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్‌ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.

ఇలాంటి మ్యాచ్‌లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.

పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్‌ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్‌ను ఆడించలేదు. ఇక వికెట్‌ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.

క్రెడిట్‌ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్‌
ఈ విజయంలో క్రెడిట్‌ పంజాబ్‌ బౌలర్లకే దక్కుతుంది. వికెట్‌ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. 

కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్‌ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్‌ పాటిదార్‌ చెప్పుకొచ్చాడు.

కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్‌ చరిత్రలో హోం గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్‌-2025: ఆర్సీబీ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌
👉టాస్‌: పంజాబ్‌ కింగ్స్‌.. మొదట బౌలింగ్‌
👉ఆర్సీబీ  స్కోరు: 95/9 (14)
👉పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు: 98/5 (12.1)
👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: టిమ్‌ డేవిడ్‌ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్‌). 

చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)