Breaking News

శివ‌మ్ దూబేపై వేటు.. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఫినిష‌ర్‌కు చోటు!

Published on Mon, 05/20/2024 - 16:46

ఐపీఎల్‌-2024 ఫ‌స్ట్‌హాఫ్‌లో అద‌ర‌గొట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్న‌ర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడ‌ని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అత‌డి వీక్‌నెస్‌గా మారింది. 

మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి సీఎస్‌కేకు అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో ఏకంగా అత‌డికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త జ‌ట్టులో సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు. కానీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ఎంపికైన త‌ర్వాత అత‌డి ఆట‌తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్న‌ది నిజంగా దూబేనేనా అన్న‌ట్లు ఉంది. 

తొలి 9 మ్యాచ్ ల్లో  172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. 

దీంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ముందు శివ‌మ్ దూబే ఫామ్ భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే వ‌ర‌ల్డ్‌కప్ ప్ర‌క‌టించిన జ‌ట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో రిజ‌ర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్ర‌ధాన జ‌ట్టులోకి ప్ర‌మోట్ చేసి.. మెయిన్ జ‌ట్టులో ఉన్న దూబేకు స్టాండ్‌బై లిస్ట్‌లోకి డిమోట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.
 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)