Breaking News

IPL 2024: రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊహించని షాక్‌!

Published on Thu, 03/21/2024 - 18:02

ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్‌, ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడం జంపా లీగ్‌ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం.

వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదిహేడో ఎడిషన్‌కు దూరం కానున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ మేనేజర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. 

కాగా ఐపీఎల్‌-2023 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ఆడం జంపాను కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్‌ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు జంపాను రిటైన్‌ చేసుకుంది రాజస్తాన్‌.

అయితే, అనూహ్యంగా తాజా సీజన్‌ ఆరంభానికి ముందు జంపా జట్టు నుంచి తప్పుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే టీమిండియా యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ కూడా ఈ ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. 

ఇక 31 ఏళ్ల ఆడం జంపా గతంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు కూల్చాడు. కాగా ఇప్పటికే జేసన్‌ రాయ్‌, గస్‌ అట్కిన్సన్‌, హ్యారీ బ్రూక్‌ తదితర విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌-2024 బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

ఇక మార్చి 22న చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో తాజా ఎడిషన్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ సేన(రాజస్తాన్‌ రాయల్స్‌) మార్చి 24న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌తో  తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఇక జంపా తప్పుకోగా.. టీమిండియా దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉండటం రాయల్స్‌కు సానుకూలాంశం.

చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)