Breaking News

టీమిండియా​కు బ్యాడ్‌న్యూస్‌.. మిడిలార్డర్‌ ఆటగాడికి గాయం..?

Published on Thu, 11/14/2024 - 19:33

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌ అందింది. ప్రాక్టీస్‌ సెషన్స్‌ సందర్భంగా మిడిలార్డర్‌ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ గాయపడ్డాడని తెలుస్తుంది. సర్ఫరాజ్‌ మోచేతికి గాయమైనట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాయం అనంతరం సర్ఫరాజ్‌ మోచేతిని పట్టుకుని నెట్స్‌ను వీడాడు. ఈ వీడియోలో సర్ఫరాజ్‌ నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

ఒకవేళ సర్ఫరాజ్‌ ఖాన్‌ గాయం నిజంగా పెద్దదై అతను తొలి టెస్ట్‌కు దూరమైతే టీమిండియా కూర్పులో తేడాలొస్తాయి. ఇది భారత జట్టుకు శుభ పరిణామం కాదు. ప్రస్తుతం సర్ఫరాజ్‌ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ పిచ్‌లపై అతడు తప్పక రాణిస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నమ్మకంగా ఉంది. 

27 ఏళ్ల సర్ఫరాజ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. వరుస హాఫ్‌ సెంచరీలు చేసి కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సర్ఫరాజ్‌.. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో (150) మెరిశాడు. అయితే ఆతర్వాత అతను కాస్త లయ తప్పాడు. సెంచరీ తర్వాత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్‌ ఒకే ఒక​ హాఫ్‌ సెంచరీ చేశాడు.

కాగా, భారత జట్టు కొద్ది రోజుల కిందట రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మినహా మిగతా జట్టంతా ఆస్ట్రేలియాకు చేరుకుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్‌ వాకా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇక్కడి ఫాస్ట్‌ మరియు బౌన్సీ పిచ్‌లపై భారత ప్లేయర్లు నిర్విరామంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 

వ్యక్తిగత కారణాల చేత రోహిత్‌ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే టీమిండియాకు తలనొప్పిగా మారింది. రోహిత్‌ స్థానంలో ఓపెనర్‌గా ఎవరిని పంపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ తలలు పట్టుకుంది. ఇప్పుడు సర్ఫరాజ్‌కు కూడా గాయమైతే టీమిండియా సమస్యలు తీవ్రతరమవుతాయి.

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

ట్రావెలింగ్‌ రిజర్వ్‌: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)