భవ్‌తేగ్‌ సింగ్‌ గిల్‌కు స్వర్ణం

Published on Wed, 11/13/2024 - 12:10

ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ భవ్‌తేగ్‌ సింగ్‌ గిల్‌(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్‌ విభాగంలో 21 ఏళ్ల భవ్‌తేగ్‌ సింగ్‌ గిల్‌ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్‌ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్‌తేగ్‌ సింగ్‌... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.

వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ భవ్‌తేగ్‌ సింగ్‌ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్‌ ఎంగ్లెజోడిస్‌ (సిప్రస్‌)కు రజతం, భారత షూటర్‌ అభయ్‌ సింగ్‌కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్‌ సింగ్‌ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్‌తేగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్‌ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.

అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్, మహిళల స్కీట్‌ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో అభయ్‌ సింగ్‌ షెఖాన్‌ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్‌లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.

అంతకుముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో సిమ్రన్‌ప్రీత్‌ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్‌ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్‌ (34 పాయింట్లు; ఫ్రాన్స్‌) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు.    

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)